పట్టిసీమ పేరుతో నిధుల అనుసంధానం..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ నేత పేర్నినాని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాయలసీమకు నీళ్లిస్తామంటూ  పట్టిసీమ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ పంపులు తెచ్చి పట్టిసీమకు పెడుతున్నారు గానీ పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లిచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం పబ్బం గడుపుకునేందుకు ప్రజధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రాజెక్ట్ లను అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పట్టిసీమ పర్మినెంట్ సొల్యూషన్ కాదని, పోలవరాన్ని త్వరగతిని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేేశారు. 

రూ.కోట్ల వెచ్చించి నధుల అనుసంధానం పేరుతో నిధుల అనుసంధానానికి పాల్పడ్డారని నాని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీ నుంచి సింగపూర్ కు సింగపూర్ నుంచి ఏపీకి నిధుల అనుసంధానం జరుగుతుందే తప్ప ఇంకేమీ జరగలేదన్నారు. వీరి నిధుల కైంకర్యానికి ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని నాని ఆరోపించారు. హడావుడిగా నాణ్యత లేని పనులు చేపడుతూ దుర్మార్గమైన కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ముందు పట్టిసీమను పక్కనబెట్టి పోలవరం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
Back to Top