ఊరూరా ‘వాక్‌ విత్‌ జగనన్న’
- వైయ‌స్ జ‌గ‌న్‌కు సంఘీభావంగా అన్ని చోట్ల పాద‌యాత్ర‌లు
- ఉత్సాహంగా పాల్గొంటున్న పార్టీ శ్రేణులు
అమరావతి :  రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స్వయంగా తెలుసుకోవడానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న నేపథ్యంలో ‘వాక్‌ విత్‌ జగనన్న’ (జగనన్నతో కలిసి నడుద్దాం) కార్యక్రమాన్ని సోమవారం భారీఎత్తున నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని పలు నగరాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. విదేశాల్లోనూ అభిమానులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
వైయస్‌ఆర్‌ జిల్లాలో వాక్‌ విత్‌ జగనన్న
వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ నేతలు సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ జిల్లాలోని చక్రాయపేట నాగులగుట్టపల్లిలో ‘వాక్‌ విత్‌ జగనన్న’ పేరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో నేతలు వైయస్‌ కొండారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 
కమలాపురం..
అదే విధంగా కమలాపురం నియోజకవర్గంలో వెయ్యి కిలోమీటర్ల పూర్తి సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. 
పులివెందులలో...
ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం చేపట్టారు. 
కడపలో..
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి పాత కలెక్టరేట్‌ వరకు వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజద్‌ బాషా, మేయర్‌ సురేష్‌బాబు, నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 
రాజంపేటలో...
వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్ల పూర్తి సందర్భంగా రాజంపేటలో వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం చేపట్టారు. 
మైదుకూరులో..
మైదుకూరు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు. 
ప్రొద్దుటూరు, రాయచోటిలో..
మోసకారి ప్రభుత్వం పాలనను ఎండగట్టేందుకు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. 
 
అనంతపురం: వైయ‌స్ఆర్‌ సీపీ కార్యాలయం నుంచి జెడ్పీ ఆఫీసు దాకా నిర్వహించిన వాక్ విత్ జగనన్న కార్యక్రమం‍లో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం సమన్వయకర్త నదీం అహ్మద్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఉరవకొండలో ఎమ్మెల్యే  వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగన్ అన్న కార్యక్రమం చేపట్టి ఉరవకొండ నుంచి బుదగవి వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తాడిపత్రిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి అన్నదానం, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. యాడికిలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి వాక్ వీత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు.  

క‌ర్నూలు:  జిల్లా వ్యాప్తంగా వాక్ విత్ జ‌గ‌న‌న్న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. క‌ర్నూలు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో బీవై రామ‌య్య‌, నంద్యాల పార్ల‌మెంట్ నియెజ‌క‌వ‌ర్గంలో శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఆధ్వ‌ర్యంలో సంఘీభావ యాత్ర‌లు మొద‌ల‌య్యాయి. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజ‌య్య‌, పాణ్యంలో గౌరు చ‌రితారెడ్డి, వెంక‌ట్‌రెడ్డి, ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్ర‌సాద్‌రెడ్డి, మంత్రాల‌యంలో ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి, డోన్‌లో ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, క‌ర్నూలులో హాఫీజ్‌ఖాన్‌, శ్రీ‌శైలంలో బుడ్డా శేషారెడ్డి, ఆళ్ల‌గ‌డ్డ‌లో గంగుల, బ‌న‌గాన‌ప‌ల్లిలో కాట‌సానిరామిరెడ్డి, ఎమ్మిగ‌నూరులో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ప‌త్తికొండ‌లో శ్రీ‌దేవి, కోడుమూరులో మాజీ ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో వాక్ విత్ జ‌గ‌న‌న్న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.


పశ్చిమగోదావరి: గ్రంధి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పేరుతో పాదయాత్ర  భీమవరం  మండలం  దొంగపిండి  గ్రామంలో నిర్వహించారు. ఇందులో  పార్టీ మండల కన్వీనర్  తిరుమాని ఏడుకొండలు,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బాయి చౌదరి, కొఠారు రామచంద్రరావుల ఆద్వర్యంలో పెదవేగి మండలం విజయరాయి గ్రామం నుంచి బలివే జంక్షన్ వరకు వాక్ విత్ జగన్ కార్యక్రమం నిర్వహంచారు.  కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు,మండల కన్వీనర్ మెట్టపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు  అద్వర్యం లో కార్యక్రమాన్ని కొనసాగించారు.  ఉండి మండలం ఉండి గ్రామంలో నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్‌ నరసింహరాజు ఆధ్వర్యంలో ఉండి బస్టాండ్ నుంచి గోరింతోట గ్రామం వరకు పాదయాత్ర చేశారు. ఇందులో జిల్లా యువజన అధ్యక్షులు మంతెన యోగీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు .కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ బస్టాండ్‌ వద్ద నుంచి జయలక్ష్మి థియేటర్ వరకు రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు.  ఇందులో  రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనందప్రకాశ్, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.  ఉంగుటూరు మండలం చేబ్రోలులో నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు  వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి నారాయణ పురం మీదుగా  ఉంగుటూరు సెంటర్కి పాదయాత్ర చేశారు. 

కృష్ణా:  శాసనసభ్యులు కొడాలి నాని అధ్వర్యంలో జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో వాక్ విత్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి  వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

విజయనగరం : ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి , అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షీత్ రాజు వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని చేపట్టి కురుపాం నుంచి చినమేరంగి వరకు  పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోలగట్ల,  పార్టీ  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్తవలస నుంచి పాత బస్టాండ్ మీదుగా వైయ‌స్ఆర్‌  విగ్రహాం వరకు వైయ‌స్‌ఆర్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు జోగారావు, ప్రసన్న కుమార్ ఆద్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 

చిత్తూరు:  వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంఘీభావంగా జిల్లావ్యాప్తంగా వాక్‌విత్ జ‌గ‌న‌న్న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలో భారీ ర్యాలీ చేప‌ట్టారు. న‌గ‌రిలో ఎమ్మెల్యే రోజా, చంద్ర‌గిరిలో ఎమ్మెల్యే భాస్క‌ర్‌రెడ్డి, పుంగ‌నూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వార‌క‌నాథ్‌రెడ్డి, గంగాధ‌ర నెల్లూరులో ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామి, పూత‌ల‌ప‌ట్టులో ఎమ్మెల్యే సునీల్‌, పీలేరులో ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి, కుప్పంలో చంద్ర‌మౌలి ఆధ్వ‌ర్యంలో వాక్ విత్ జ‌గ‌న‌న్న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.

ప్ర‌కాశం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా వాక్ విత్ జ‌గ‌న‌న్న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఒంగోల్‌లో మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ర్యాలీ చేప‌ట్టారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌ల కేంద్రాల్లో సంఘీభావ పాద‌యాత్ర‌లు చేప‌డుతున్నారు. 
Back to Top