విశాఖపట్నంలో వైయస్‌ఆర్‌ సీపీ ‌భారీ ర్యాలీ

విశాఖపట్నం, 20 సెప్టెంబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గురువారంనాడు విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించింది. భారత్‌ బంద్‌లో భాగంగా పార్టీ స్థానిక విభాగం ఈ కార్యక్రమం చేపట్టింది. డీజిల్ ధర పెంపు, వంటగ్యా‌స్‌పై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కొనసాగిన ఈ ర్యాలీకి విశాఖ వాసుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వాల తీరును తూర్పారపట్టారు. డాల్ఫిన్ జంక్ష‌న్ నుంచి ఎ‌ల్ఐసీ బిల్డింగ్ సమీపంలోని అంబేద్క‌ర్ విగ్రహం వరకు ర్యాలీ ‌నిర్వహించారు.

Back to Top