మేయర్ పీఠం కైవసం చేసుకునేలా ఎన్నికలకు సిద్ధమవ్వండి

వైజాగ్ః జీవీఎంసీకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విశాఖ మేయర్‌ పీఠం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.  జీవీఎంసీ పరిధిలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. వైయస్సార్‌ కుటుంబం, నవరత్నాల పథకాలపై సమీక్షించారు. అనంతరం విడివిడిగా నియోజకవర్గాల సమన్వయకర్తలతో పలు అంశాలపై మాట్లాడారు. జీవీఎంసీ ఎన్నికలకు సన్నద్ధత, వ్యూహ ప్రతి వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల్లోనూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పట్ల ఆదరణ, పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానం పెరుగుతోందని చెప్పారు.

 రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తప్పడు హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. వీటన్నిటిని ఇంటింటికి వైయస్సార్‌ కుటుంబం, నవరత్నాల పథకం గురించి వివరించడానికి వెళ్లినప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? సీఎం చంద్రబాబుకు ఎలా బుద్ధి చెప్పాలా? అని ఎదురు చూస్తున్నారని చెప్పారు.

Back to Top