విజయమ్మతో కృష్ణబాబు సమావేశం

హైదరాబాద్, 6 అక్టోబర్‌ 2012: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ‌నాయకుడు, కొవ్వూరు మాజీ శాసనసభ్యుడు పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) శనివారం లోటస్ పాం‌డ్‌లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను మర్యాద పూర్వకంగా కలిశారు. కృష్ణబాబుతో‌ పాటు పార్టీ సీనియర్ ‌నాయకులు ఎం.వి. మైసూరారెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు.
కాగా, చంచల్గూడ జైలులో‌ ఉన్న జగన్మోహన్‌రెడ్డిని శుక్రవారంనాడు ములాఖాత్‌ సమయంలో కలుసుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటు‌న్నారని తెలుస్తోంది. ఈ నెలలోనే ముహూర్తం చూసుకుని కృష్ణబాబు పార్టీలో చేరే అవకాశం ఉంది.
Back to Top