విజయమ్మ శరీరంలో తగ్గిన చక్కెర స్థాయిలు

హైదరాబాద్, 3 ఏప్రిల్‌ 2013: న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులో 'కరెంట్‌ సత్యాగ్రహం' చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గిపోయాయి. దీక్షలో ఉన్న శ్రీమతి విజయమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బుధవారం ఉదయం వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండవరోజు బుధవారం కూడా వారంతా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని మంగళవారం ఉదయం నుంచీ వారు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీమతి విజయమ్మ నిన్నటి నుంచీ అన్న, పానీయాలు ముట్టకుండా నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండడంతో ఆమె ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు.
Back to Top