విజయమ్మ సమక్షంలో నేడు జిట్టా చేరిక

భువనగిరి:

యువ తెలంగాణ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నల్గొండ జిల్లా భువనగిరిలో సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటవనున్న సభలో ఆయన పార్టీలో చేరతారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఇందులో పాల్గొంటారు. ఆమె సమక్షంలో జిట్టా పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. ఈ సభకు పార్టీకి చెందిన అనేకమంది ముఖ్య నేతలు హాజరవుతారు.

Back to Top