విజయమ్మను కలిసిన శోభారాణి

తుని:

తూర్పు గోదావరి జిల్లా తుని పురపాలక సంఘం మాజీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి, తన భర్త సత్యనారాయణతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వై.యస్. విజయమ్మను కలుసుకున్నారు. తుపాను బాధితులను పరామర్ఙంచేందుకు వచ్చిన విజయమ్మను వారు సాయినగర్‌లోని దాడిశెట్టి రాజా నివాసంలో బుధవారం ఉదయం కలిశారు.  పార్టీకి సంఘీభావం ప్రకటించారు. తమకు మహానేత వై.యస్. రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. తొలిసారిగా తుని వచ్చిన విజయమ్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్టు వారు తెలిపారు. త్వరలో తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు  వెల్లడించారు. శోభారాణి దంపతులను పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర బోస్, కొణతాల రామకృష్ణ, కుడుపూడి చిట్టబ్బాయి, ఇతర నాయకులకు దాడిశెట్టి రాజా పరిచయం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top