విజయమ్మను కలిసిన చంద్రశేఖర్ బంధువులు

హైదరాబాద్:

పిల్లలను మందలించారన్న ఆరోపణపై నార్వేలో జైలు శిక్ష అనుభవిస్తున్న టీసీయస్ ఉద్యోగి చంద్రశేఖర్ దంపతులు కుటుంబ సభ్యులు గురువారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను లోటస్ పాండ్ కార్యాలయంలో కలుసుకున్నారు. తమ పార్టీ తరఫున ఈ అంశంపై శ్రద్ధ చూపాల్సిందిగా కేంద్రానికి లేఖ రాస్తామని శ్రీమతి విజయమ్మ వారికి తెలిపారు. వారి కుటుంబానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

Back to Top