<strong>ఖమ్మం, 19 నవంబర్ 2012:</strong> వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు సోమవారం సాయంత్రం ఖమ్మంలో ఘనంగా స్వాగతం లభించింది. వైయస్ అభిమానులు, వైయస్‌ఆర్‌సిపి కార్యకర్తలు, జిల్లా వాసులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా విజయమ్మ ఖమ్మం వచ్చారు. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆమె పాల్గొన్నారు. విజయమ్మ రాక సందర్భంగా నేల ఈనిందా అన్న చందంగా జనం తండోపతండాలుగా మైదానానికి తరలివచ్చారు. ఆహూతులతో గ్రౌండ్, ఆ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జలగం వెంకట్రావుతో పాటు సోమవారంనాడు పలువురు జిల్లా ప్రముఖులు వైయస్‌ఆర్ కాంగ్రెస్లో చేరారు.