విజయమ్మకు ఖమ్మంలో ఘనస్వాగతం

వరంగల్ 7

నవంబర్ 2012  : 'నీలం' తుఫాను బాధితుల పరామర్శ కోసం ఖమ్మం చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు విజయమ్మకు గురువారం వేలాది మంది ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2 గంటలకు విజయమ్మ ఖమ్మం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. విజయమ్మకు స్వాగతం పలకడం కోసం వచ్చిన జనంతో ఖమ్మం రైల్వేస్టేషన్ జనంతో క్రిక్కిరిసి పోయింది. అక్కడ ప్రజలకు అభివాదం చేసిన విజయమ్మ ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్లిన విజయమ్మకు మార్గమధ్యంలో వరంగల్ రైల్వేస్టేషన్‌ లోనూ ఘనస్వాగతం
లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ
కార్యకర్తలు, అభిమానులు ఆమెకు సాదర స్వాగతం పలికారు.

Back to Top