హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి పేరును ఖరారు చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో భేటీ అనంతరం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయ సాయిరెడ్డి పేరును ప్రకటించారు. విజయ సాయిరెడ్డి ఎంపిక పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నామినేషన్ వేసేందుకు విజయ సాయిరెడ్డితో పాటు పార్టీ నేతలు అసెంబ్లీకి బయల్దేరారు.