ప్రజలకు మరింతగా సేవలు

న్యూఢిల్లీ: వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా విజయసాయిరెడ్డి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.

అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ పదవిని తాను అలంకార ప్రాయంగా భావించటం లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి రాష్ట్రాభివృద్ధికి తన వంతుగా పాటు పడతానని ఆయన అన్నారు. వైయస్సార్సీపీ నుంచి తానే మొదటి రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావటం సంతోషంగా ఉందని అభిప్రాయ పడ్డారు. ఇందుకు గాను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 

Back to Top