విద్యుత్ ఉద్యమం మరింత ఉధృతం

హైదరాబాద్, 1 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలపై పోరాటం ఉధృతం చేయాలని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నిర్ణయించింది.‌ రాష్ట్ర ప్రజల నడ్డి విరిచేలా నిర్ణయం చేసిన కరెంటు ఉద్యమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఇప్పటికే క్రియాశీలంగా పాల్గొంటున్నది. తదుపరి కార్యాచరణ నిర్ణయించేందుకు రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం హైదరాబాద్‌లో సమావేశం అవుతున్నది. పెరిగిన విద్యు‌త్ చార్జీల వల్ల ఏయే వర్గాలపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో‌ ఈ సమావేశంలో సమీక్షిస్తారు. తీవ్రమైన విద్యుత్ కోతలు, సంక్షోభం కారణంగా వ్యవసాయ‌ం, పారిశ్రామిక రంగాలు ఇప్పుడు కుదేలైపోయాయి. లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్‌ చార్జీలకు తోడు మళ్లీ భారీగా చార్జీలు పెంచిన నేపథ్యంలో ప్రజాపక్షంగా ప్రజల్లోకి వెళ్లి పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ‌నిర్ణయించింది.

తాజా వీడియోలు

Back to Top