'విద్యుత్'పై వైయస్ఆర్ సిపి వాయిదా తీర్మానం

హైదరాబాద్‌, 18 సెప్టెంబర్‌ 2012: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్‌ సంక్షోభంపై
చర్చ కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారంనాడు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.
విద్యుత్‌ కోతల కారణంగా రాష్ట్రంలోని అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రలు మూతపడిపోతుండడం, వేలాది మంది కార్మికులు
రోడ్డున పడుతుడడంతో ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ తీసుకునే చర్యలేమిటో ప్రజలకు వెల్లడించేందుకు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. కాగా,  తెలంగాణ
అంశంపై టీఆర్ఎ‌స్, బీజేపీ, అవినీతి మంత్రుల తొలగించాలని టీడీపీ, డీజీ‌ల్ ధర పెంపు, గ్యా‌స్ సిలిండర్ల కోతపై ఎంఐఎం, సమగ్ర
అబ్కారీ చట్టం కోరుతూ సీపీఐ, సాగ‌ర్ ఎడమ కాల్వకు
నీరు విడుదల చేయాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

యధావిధిగా నిరసనలు :

తొలిరోజు సోమవారం వాయిదాలతో ముగిసిన శానససభ సమావేశాలు రెండవ రోజు కూడా అదేవిధంగా
ప్రతిపక్షాల తీవ్ర నిరసనలు, గందరగోళం
మధ్య ప్రారంభమయ్యాయి. మంగళవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల
మనోహ‌ర్ విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాలకు అనుమతి ఇచ్చారు‌. అయితే,
ప్రతిపక్ష పార్టీల సభ్యులు తమ వాయిదా తీర్మానాలపై చర్చకు అనుమతించాల్సిందేనని
పట్టుబట్టారు. సభా సమయాన్ని వృథా చేయద్దొంటూ స్పీకర్ సభ్యులకు
విజ్ఞప్తి చేశారు. అయినా ‌వారు తమ నిరసన
కొనసాగిస్తూనే ఉన్నారు.

Back to Top