విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం: భూమన

తిరుపతి : విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి(వైఎస్ఆర్ కాంగ్రెస్‌ ) ధ్వజమెత్తారు. మహానేత గుర్తులు చెరిపేసేందుకు విద్యార్థుల భవిష్యత్తను ఫణంగా పెట్టేందుకు కూడా వెనకాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్‌పై పార్టీ గౌరవధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ నెల 6,7తేదీలలో చేపట్టే ఫీజు పోరుకు విద్యార్థులు భారీగా తరలి రావాలని పిలుపిచ్చారు. వార్డు బాటలో భాగంగా తిరుపతిలోని వివిధ వార్డులులో భూమన పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Back to Top