<strong>నెల్లూరు : </strong>విద్యుత్ చార్జీల పెంపునకు అధికార పార్టీ నాయకులు, మంత్రులే బాధ్యత వహించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆదివారం రాత్రి వైయస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరులోని కె.వి.ఆర్ పెట్రోలు బంకు సెంటరులో విద్యార్థులు వీధిలైట్ల కింద చదువుకుని, హోంవర్కు పూర్తిచేశారు.<br/>ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ, కరెంటు చార్జీల భారంతో విద్యార్థులు వీధిదీపాల కింద చదువుకుంటున్నారన్నారు. సర్‌చార్జీల భారం మోపి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తూ సహకార ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. విద్యుత్ చార్జీలను వ్యతిరేకిస్తూ మంత్రులు, నాయకులను నిలదీస్తామని కోటంరెడ్డి హెచ్చరించారు.