వరద మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

తుని:

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన తుని పర్యటనలో బాధితుల కోసం ఒక్క గంట కూడా  కేటాయించలేకపోయారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో బుధవారం ఉదయం ఆమె విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఇటువంటి పరిస్థితులలో బాధితులకు ఏం న్యాయం చేస్తారని ఆమె సీఎంను ప్రశ్నించారు. ఆయన తన పర్యటనలో ఏ ఒక్క హామీ ఇవ్వలేదని విమర్శించారు. పంటల బీమా పథకం నుంచి 25 శాతం తక్షణం బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. మూడు లక్షల పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏలేరు ఆధునికీకరణకు వైయస్ఆర్ రూ. 132 కోట్లు కేటాయించారని చెప్పారు.  ఇంతవరకూ అది ఎందుకు పూర్తి కాలేదని నిలదీశారు. వైయస్ఆర్ లేకపోవడంతో ప్రతి పనీ నిలిచిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

Back to Top