వరద బాధితుల పరామర్శకు విజయమ్మ

హైదరాబాద్

4 నవంబర్ 2012 :  రాష్ట్రంలో తీవ్ర వర్షాలు, వరదల వల్ల బాగా నష్టపోయిన ప్రాంతాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్. విజయమ్మ సోమవారం నుండి పర్యటిస్తారు. ఆమె సోమవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి ఏలూరు, ఉంగటూరు, ఉండి, భీమవరం, రాజోలు, గన్నవరం మీదుగా అమలాపురం వరకూ వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తారు. మంగళవారం (నవంబర్ 6) న అమలాపురం నుంచి బయలుదేరి ముమ్మిడివరం, తుని, పాయకరావుపేట, అనకాపల్లి మీదుగా విశాఖపట్టణం వరకూ పర్యటిస్తారు. వర్షాలు, వరదల వల్ల బాగా దెబ్బతిన్న మిగతా జిల్లాలలో కూడా విజయమ్మ పర్యటన ఉంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికాప్రకటనలో తెలిపింది. వరద బాధితులకు చేయూతను ఇవ్వడానికి పార్టీ శ్రేణులన్నీ వెంటనే కదలాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
ప్రజలు
కష్టంలో ఉన్నారనీ, వారిని ఆదుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూనుకోవాలని ఆమె ఆదివారం
పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలోనూ కోరారు. వరద బాధిత
ప్రాతాలకు తాను బయలుదేరి వెళుతున్నానని ఆమె చెప్పారు. ఆర్భాటాలకు పోకుండా ప్రజల మధ్య
ఉండి పని చేయాలని ఆమె సూచించారు. ఆమె ఎప్పటికప్పుడు
వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో వరదల తీవ్రతపై  వైయస్ఆర్
సీపీ నాయకులతో చర్చిస్తున్నారు. ముంపు పరిస్థితులపై ఆదివారం ఉదయాన్నే విజయమ్మ ఆరా
తీసి, ఆయా జిల్లాల పార్టీ కో-ఆర్డినేటర్లతో మాట్లాడారు. బాధితులను
ఆదుకునేందుకు సాయం చేయాలని పార్టీ వర్గాలను ఆమె కోరారు. ఆమె ఆదేశాలపై
ఇప్పటికే పలువురు వైయస్ఆర్ సీపీ నాయకులు ఆయా జిల్లాలలో వరద ముంపు
ప్రాంతాలను పర్యటిస్తున్నారు. అనకాపల్లిలో సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ
ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాలలో బాధితులకు
అందించవలసిన సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు.

Back to Top