వరద బాధితులకు దుప్పట్లు అందజేత

కాకినాడ:

కాకినాడ రూరల్ ప్రాంతంలో వర్షాల కారణంగా ముంపునకు గురయిన ప్రాంతాల ప్రజలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాకినాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సత్యప్రసాద్ ఇందుకు ముందుకొచ్చారు. దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ వరద ప్రాంతాలలో పర్యటన సందర్భంగా బాధితులను ఆదుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన చెప్పారు. వరదల కారణంగా వందలాదిమంది ఇక్కట్లకు గురయ్యారని సత్యప్రసాద్ తెలిపారు.

Back to Top