వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో రంగా వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం


హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో  కాపు నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్య‌క్ర‌మంలో రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయ‌కులు కొండా రాఘ‌వ‌రెడ్డి, అధికార ప్ర‌తినిధి బ‌త్తుల బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఎన్‌. ప‌ద్మ‌జా, నాయ‌కులు ఎం. అరుణ్‌కుమార్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Back to Top