ప్రత్యేకహోదా సాధించే వరుకూ పోరాటం ఆగదు..


ఢిల్లీ వేదికగా చంద్రబాబు మోసాలను ఎండగడతాం...
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి

శ్రీకాకుళంః ఏపీకి ప్రత్యేకహోదా సాధించే వరుకూ పోరాటం ఆగదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి చేసిన మోసాలను ఢిల్లీ వేదికగా ఎండగడతామన్నారు.ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు డాక్టరేట్‌ సాధించారని విమర్శించారు.అధికారంలోకి వస్తే ప్రజలకు సురక్షిత పాలన అందిస్తామని చెప్పడమే కాకుండా విభజిత ఏపీకి 10 సంవత్సరాల పాటు ప్రత్యేకహోదా తీసుకువస్తామని వెంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతిలో ప్రసంగించిన మోదీ,చంద్రబాబులు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకహోదాను పూర్తిగా విస్మరించారన్నారు.వంచనపై గర్జన నిరసన ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి చేసిన అన్యాయాన్ని రేపు ఢిల్లీ వేదికగా నిలదీస్తామన్నారు.హోదా అంటే జైలే అన్న చంద్రబాబు మళ్లీ ధర్మపోరాట దీక్షల పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హోదా కోసం పోరాటం చేసిన వారిని జైలుకు పంపిన చరిత్ర చంద్రబాబు అని దుయ్యబట్టారు. హోదా కోసం వైయస్‌ జగన్‌ అనేక రూపాల్లో దీక్షలు చేశారన్నారు.హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పదవులకు రాజీనామాలు చేశారన్నారు.కేంద్ర ప్రభుత్వంపై వైయస్‌ జగన్‌ అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారన్నారు.
Back to Top