నేడు అనంతలో వంచన పై గర్జన దీక్ష

అనంతపురం: ప్రత్యేక హోదా సాధన కోసం, విభజన
చట్టంలోని హామీల అమలు కోసం నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తునన వైయస్ ఆర్
కాంగ్రెస్ పార్టీ సోమవారం మరో పోరాటం చేస్తోంది. జిల్లాల వారీగా నిర్వహిస్తున్న
వంచన పై గర్జన దీక్షల్లో భాగంగా మూడో దీక్ష కార్యక్రమాన్ని అనంతపురం ఆర్ట్స్
కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4
గంటల వరకు జరిగే ఈ దీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దీక్షలో
పాల్గొననున్న నాయకులంతా నల్లటి దుస్తుల ధరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
వైఖరిపట్ల నిరసన వ్యక్తం చేయనున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో
ప్రజల ఆకాంక్షను ప్రస్ఫుటంగా లోకానికి చాటడానికి, కేంద్రం చేస్తున్న మోసం,
చంద్రబాబు కుట్రలను నిరసిస్తూ విశాఖపట్టణంలో వంచనపై గర్జన దీక్షను నిర్వహించారు.
రెండో దీక్షను గత నెల 2 వ తేదీన నెల్లూరు నిర్వహించగా మూడోసారి అనంతపురం వేదికగా
వైయస్ ఆర్ నాయకులు ప్రత్యేక హోదా కోసం గర్జించనున్నారు.

ప్రత్యేక హోదాకోసం గడచిన
నాలుగేళ్లుగా వైయస్ ఆర్ కాంగ్రెస్ అలుపెరగని పోరాటాలు చేస్తూ, ఈ అంశంపై నిరంతరం
వత్తిడి పెంచుతోంది. రాష్ట్ర పురోగతికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమంటూ పార్టీ
అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి వేదికపైనా చాటి చెపుతున్నారు. ఈ దిశలో
బంద్ లు, రాస్తారోకోలు, మానవహారాలు, యువభేరీలు వంటి అనేక కార్యక్రమాలతో ప్రజలను
చైతన్య వంతులను చేస్తే, వీటిని అడ్డుకోడానికి అధికార తెలుగుదేశం పార్టీ  దమననీతిని అనుసరించింది. వీటన్నిటిపైనా మరోసారి
వంచన పై గర్జన దీక్షలో నాయకులు లోకానికి చాటనున్నారు.

తాజా వీడియోలు

Back to Top