వైయస్ పేరు చెబితే పథకాలకు చెల్లు

షర్మిలకు మొరపెట్టుకున్న రైతన్న
ఆత్మకూరు:

వైయస్ఆర్ పేరు చెబితే పథకాలు ఆగిపోతాయా.. అనే ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నారు అనంతపురం జిల్లా ఆత్మకూరు గ్రామ వాసులు. మరో ప్రజాప్రస్థానం ఎనిమిదో రోజు యాత్రలో భాగంగా మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సోదరి అయిన షర్మిల గురువారం ఆత్మకూరు గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. వైయస్ఆర్ పేరు పెట్టుకున్నందుకు తమ గ్రామానికి నీళ్ళిచ్చే పథక నిర్మాణాన్ని నిలిపేశారని ఎస్. మోహన్ రెడ్డి అనే రైతు షర్మిలకు ఫిర్యాదు చేశారు. మహానేత ఫొటోలున్న ఫ్లెక్సీలు కట్టినందుకు రోడ్డు నిర్మాణాన్నీ ఆపేశారని చెప్పారు. తాగడానికి నీళ్ళు లేవనీ, బస్సులు సరిగా రావనీ, సాగు చేసుకునే అవకాశం కూడా  లేదనీ ఆయన తెలిపారు. తమ ఎమ్మెల్యే వెంకట్రమిరెడ్డి ఇవేమీ పట్టించుకోవడం లేదనీ, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందనీ వివరించారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి కల్పించుకుని సమస్యలను షర్మిలకు ఏకరవుపెట్టారు. అన్ని సమస్యలనూ చూస్తున్నాననీ, వీటన్నింటికీ ఒకటే పరిష్కారమనీ అది జగనన్న ముఖ్యమంత్రి కావడమేననీ షర్మిల చెప్పారు. ధైర్యంగా ఉండాలని రైతుకు ధైర్యం చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top