'వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిదే అంతిమ విజయం'

నిడదవోలు (ప.గో.జిల్లా) : కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజా కోర్టులో అంతిమ విజయం కచ్చితంగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిదే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో శని, ఆదివారాల్లో జరగనున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఏర్పాట్లను శుక్రవారం వారు పర్యవేక్షించారు. పట్టణంలో జరగనున్న బహిరంగ సభ స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక టౌన్‌హాల్‌లో నిర్వహించిన సమావేశంలో పాదయాత్ర ఏర్పాట్లపై పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో చర్చించారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు‌ యత్నిస్తున్నారని ఆళ్ల నాని అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వస్తున్న అపురూప ప్రజాదరణను చూసి ఓర్వలేకే శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టి ఏడాదిగా నిర్బంధించాయని ఆరోపించారు. ఆయనకు బెయిల్ రాకుండా కుట్రలు పన్నుతున్నాయన్నారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని నాని కోరారు. పేద, మధ్య తరగతి వర్గాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారందరిని పార్టీ శ్రేణులు కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. పార్టీలో ప్రతి ఒక్కరి‌కీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ,‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి టిడిపి, కాంగ్రెస్‌లు కుట్రలు పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్‌ కుటుంబానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని, పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ మాట్లాడుతూ‌, కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం ‌టిడిపిలు ప్రజల సమస్యలను పట్టించుకునే స్థితిలో లేవన్నారు. ప్రజల తరఫున పోరాడుతోంది ఒక్క వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని చెప్పారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ, శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.

Back to Top