<strong>తిరుపతి, 22 డిసెంబర్ 2012:</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదల కోరుతూ తిరుమలకు పాదయాత్ర చేస్తున్న పార్టీ మహిళా విభాగం నాయకులపై పోలీసులు దాదాగిరికి దిగారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత మండలం కలికిరిలో ఈ సంఘటన చోసుచేసుకోవడం చర్చనీయాంశమైంది. పాదయాత్రగా తిరుమలకు వెళుతున్న వైయస్‌ఆర్ సిపి మహిళా కార్యకర్తలపై పోలీసులు శనివారం దౌర్జన్యం చేశారు. పోలీసుల దృష్టిలో ఆ మహిళా కార్యకర్తలు చేసిన తప్పల్లా వైయస్ఆర్ అమర్ రహే అని నినాదాలు చేయడమే! దీనితో మహిళా కార్యకర్తలపై పోలీసులు మండిపడ్డారు. జిల్లా వైయస్‌ఆర్ సిపి మహిళా నేత గాయత్రిదేవిని ఉద్దేశించి ఎస్ఐ సోమశేఖర్ పరుష పదజాలంతో దూషించారు. ఎస్ఐ తీరుపై గాయత్రిదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.