వైయస్‌ఆర్‌సిపిలోకి భారీ సంఖ్యలో చేరికలు

హైదరాబాద్, 21 జనవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి రోజురోజుకూ చేరికలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని ధూల్‌పేటకు చెందిన సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు తాజాగా సోమవారంనాడు పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లతో సహా స్థానిక నాయకుల నేతృత్వంలో వారంతా పార్టీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా తరలివచ్చారు. వారంతా వైయస్‌ఆర్‌సిపి సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కొత్తగా చేరిన వారికి మైసూరారెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు బి. జనక్‌ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

వైయస్ఆ‌ర్ ‌జిల్లాలో...:
కడప : వైయస్‌ఆర్ జిల్లా కలశపాడు మండలం చింతలపల్లెలో ‌టిడిపికి చెందిన ఎస్‌.కె.ర‌ంత్తో సహా మూడు వేల మంది కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీలో చేరారు. బద్వేల్ మాజీ ఎమ్మెల్యే ‌బి.సి. గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వారు సోమవారం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు వైయస్ అవినా‌ష్ రెడ్డి, ఎమ్మెల్యే అమ‌ర్నా‌థ్‌రెడ్డి, సురేష్‌బాబు, రఘురామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.


Back to Top