వైయస్‌ఆర్‌సిపిలో చేరిన మాజీ మంత్రి బాలరాజు

విశాఖపట్నం, 26 డిసెంబర్‌ 2012: విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి ఎం బాలరాజు బుధవారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా పార్టీ ఎన్నికల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు సమక్షంలో ఆయన వైయస్‌ఆర్‌సిపిలో చేరారు. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలరాజు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపి సబ్బం హరి కూడా పాల్గొన్నారు.
Back to Top