'వైయస్‌ఆర్‌ సిపికి పెరుగుతున్న ఆదరణ'

భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా): వైయస్ కాంగ్రె‌స్ పార్టీకి‌ పల్లెల్లో ఆదరణ మరింత పెరుగుతోందని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. జిల్లాలోని జక్కరంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాతపాటి సర్రాజుతో కలిసి జెండా స్థూపాన్ని ప్రారంభించి, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ, కాంగ్రెస్, ‌టిడిపి కుమ్మక్కు రాజకీయూలను ప్రజలు గమనించి, ఆ పార్టీల వైఖరిని అసహ్యించుకుంటున్నారని అన్నారు. గ్రామగ్రామాన వైయస్‌ఆర్ ‌సిపి జెండా స్థూపాలు నిర్మిస్తూ అభిమానం చాటుకుంటున్నారని చెప్పారు. దళితులు వైయస్‌ఆర్‌ సిపిపై చూపిస్తున్న అభిమానం మరువలేనిదని సర్రాజు అన్నారు. త్వరలోనే వైయస్‌ఆర్‌సిపి అధికారంలోకి వస్తుందని, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్ స్వర్ణయుగం మళ్లీ రాబోతోందని చెప్పారు.‌

బుధవారం వైయస్‌ఆర్‌ సిపి సమావేశం:
పాలకొల్లు: సహకార ఎన్నికలపై చర్చించేందుకు 26వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పాలకొల్లు మార్కెట్ యార్డు ఆవరణలో సమావేశం నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తెలిపారు. మాజీ ఎంపి చేగొండి వెంకట హరిరామ జోగయ్య, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు, రైతులు హాజరు కావాలని శేషుబాబు కోరారు.
Back to Top