వైయస్ఆర్ సీపీ విజయం ఖాయం

కాగజ్‌నగర్:

రానున్న 2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల మదిలో భద్రంగా ఉన్నాయన్నారు. ఆయన కుమారుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి కూడా పేదల పక్షాన నిలుస్తారని పేర్కొన్నారు. షర్మిల చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు.

Back to Top