వైయస్ఆర్‌పై గూడుకట్టుకున్న అభిమానం

మహబూబ్‌నగర్‌: : దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజలను ఎంతగా ప్రేమించారో ఆయనను కూడా వారు అంతగానే అభిమానిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా పేర్కొన్నారు. ప్రాంతాలకు అతీతంగా ఇది  ఉందన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి వైయస్ షర్మిల అడుగులో అడుగు వేస్తున్న ప్రతి ఒక్కరూ కుమ్మక్కు నీచ రాజకీయాలను చీల్చి చెండాడే యోధులేనని ఆమె అభివర్ణించారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల ప్రజల  సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారన్నారు.  ఏ  కార్యక్రమాలు చేపడితే మేలు ఒనగూరుతుందో  శ్రీ జగన్మోహన్‌రెడ్డికి తెలియజేస్తారన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో శ్రీమతి షర్మిలతో పాటు రోజా పాల్గొన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

ఏ చెల్లీ తన అన్న కోసం చేయని విధంగా శ్రీమతి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర సాహసం చేయడాన్నిమహిళలంతా అభినందిస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమైనప్పుడు వచ్చిన జనసందోహాన్ని చూసిన ఇతర పార్టీలకు వెన్నులో వణుకు పుడుతోందన్నారు.  శ్రీ వైయస్ జగన్‌గాని, శ్రీమతి విజయమ్మ గాని, శ్రీమతి షర్మిల గానీ తెలంగాణ సెంటిమెంట్‌ను ఎంతగా గౌరవిస్తున్నారో పార్టీ ప్లీనరీ నుంచే స్పష్టంగా తెలుస్తోందన్నారు. అమర వీరులందరికీ వారు నివాళులు అర్పించిన విషయాన్ని రోజా గుర్తుచేశారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలంతా షర్మిలకు వాగ్దానం చేయడంతో ప్రజల పట్ల తమకు మరింతగా గౌరవం పెరిగిందని రోజా అన్నారు. వారికి పాదాభివందనం చేసుకోవాలన్నారు. మహానేత వైయస్ వల్ల లాభం పొందిన నాయకులందరూ అధికార దాహంతో ఆయనను వదిలేసినా, ఉపయోగం పొందిన ప్రజలంతా వైయస్ రుణం తీర్చుకోవడానికి ఆయన కుటుంబానికి మద్దతుగా నిలబడడం చాలా గొప్ప విషయమని, వారిని అభినందిస్తున్నానని రోజా తెలిపారు. ప్రజలు కోరుకున్నవారే నాయకులవుతారని విమర్శలు చేసేవారు ఏమీ కాలేరని రోజా వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

Back to Top