వైయస్ఆర్ పాలనలోనే దళితుల సంక్షేమం

శ్రీకాళహస్తి రూరల్: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలోనే దళితులకు న్యాయం జరిగిందని వైయస్‌ఆర్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్‌ఆర్‌బీ కల్యాణ మండపంలో పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ నియోజకవర్గ స్థాయి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా రాజకీయంగా బలపడాలని ఆకాంక్షించిన మొదటి వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. వైయస్‌ఆర్ పాలనలో దళితులకు ప్రత్యేక గుర్తింపు, హోదా ఉండేదన్నారు. అదేస్థాయిలో దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేమాలన్నదే జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని తెలిపారు. దళిత మహిళలు లక్షాధికారులు కావాలన్నదే జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని తెలిపారు. 

సంక్షేమ పథకాల అమలు జగన్‌కే సాధ్యం
గుడుపల్లె: దివంగత ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు వైయస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి, జెడ్పీ మాజీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యంరెడ్డి చెప్పారు. గుడుపల్లె, కాడేపల్లె, రైల్వేస్టేషన్‌క్రాస్‌లో గడపగడపకూ వైయస్‌ఆర్ పార్టీ కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి వైయస్‌ఆర్ సీపీ ప్రవేశపెట్టబోయే పథకాల గురించి వివరించి, జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం వైయస్‌ఆర్  పథకాలను కావాలనే నీరుగారుస్తోందని ఆరోపించారు. 

బాబు యాత్రను ప్రజలు నమ్మరు
మదనపల్లె: తలపాగా చుట్టుకుని పాదయాత్ర చేసినంత మాత్రాన చంద్రబాబును ప్రజలు ఎవరూ నమ్మరని వైయస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి చెప్పారు. మదనపల్లెలోని వైయస్ఆర్ సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు ఉదయకుమార్ ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. యాత్ర పేరుతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ను జైలులో కలిసి పరామర్శించిన టీడీపీ నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెబుతున్న చంద్రబాబు, ఆయన ఆస్తులపై విచారణ జరగకుండా ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులను కలుసుకుంటే తప్పులేదా అని ఆయన ప్రశ్నించారు. ఆయనకో న్యాయం.. ఇతరులకో న్యాయమా అన్నారు. 
Back to Top