‌వైయస్ఆర్ మరణానంతరం కుంటుపడిన అభివృద్ధి

తాండూరు: మహానేత వైయస్ మరణానంతరం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఆయన ఐదోసారి ఎన్నికైన సందర్భంగా మంగళవారం తాండూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు రవిగౌడ్ అధ్యక్షతన అభినందన సభలోఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత సీఎంగా పగ్గాలు స్వీకరించిన రోశయ్య, అనంతరం పదవిలోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కూడా దారుణంగా పడిపోయిందన్నారు. తనకు ఐదోసారి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి దక్కేందుకు కృషి చేసిన పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు మహేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరుణం పురుషోత్తంరావు, రాజుగౌడ్, రవూఫ్, కోట్రిక వెంకటయ్య, శోభారాణి, పరిమళ, రాందాస్, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.

Back to Top