వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరికలు

కొత్తపాడు (తణుకు), 01 జూన్ 2013:

తణుకు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఈ కార్యక్రమానికి నాయకత్వం  పార్టీలో చేరారు. కొత్తపాడులో వారు శ్రీమతి వైయస్ షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.

తణుకుకు చెందిన న్యాయవాది, మాజీ మునిసిపల్ ఉపాధ్యక్షుడు ఇవటూరి కిశోర్, మాజీ కౌన్సిలర్లు మారిశెట్టి శేషగిరి, గెద్దా వెంకట నారాయణ, అత్తిలికి చెందిన ప్రవాస భారతీయుడు దిరిశాల కృష్ణ శ్రీనివాస్, సూర్యం బ్రదర్స్ , తేతలికి చెందిన మాజీ సర్పంచ్లు చుక్కా జార్జిలివింగ్ స్టన్, నడింపల్లి రాజన్‌బాబు, సొసైటీ మాజీ అధ్యక్షుడు వేములమంద సుబ్రహ్మణ్యంరాజు, మాజీ ఉపసర్పంచ్ సరెళ్ల అర్జయ్య, మాజీ వార్డు సభ్యులు సరె ళ్ల వీరతాతయ్య, బల్లిపాడు మదనగోపాలస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తలారిశ్రీను, సొసైటీ డెరైక్టర్లు గుబ్బల ఆంజనేయులు, తోట సత్యనారాయణ, కన్నూరి దానయ్య, అన్నెంనీడి రామారావు, వడ్డి పద్దరాజు, తోట సత్యనారాయణ, ఇరగవరం మండలం తూర్పువిప్పర్రుకు చెందిన ఆకేటి రామన్న, ఉదిసి భాస్కరరావు, కోనా దేవ (శ్రీను), గన్నాబత్తుల నాగరాజు, ఆకేటి మురళికృష్ణ, ఏలేటిపాడు గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు మేడపాటి తాతారెడ్డి పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

Back to Top