వైయస్ఆర్ కాంగ్రెస్ ఆందోళన ఉద్రిక్తం

నెల్లూరు, 15 ఏప్రిల్ 2013:

ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన సోమవారం ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, నెల్లూరు నగర సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు ఉదయం గాంధీబొమ్మ వద్దకు చేరుకున్నారు. మంత్రి ఆనం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలకు అనుమతినివ్వరాదని పోలీసులకు ఆనం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు.

Back to Top