వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగు రైతు ఉపాధ్యక్షుడు

శింగనమల

: తెలుగు రైతు
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ తరిమెల శరత్‌చంద్రారెడ్డి వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతపురం నగరంలో షర్మిల పాదయాత్ర
సందర్భంగా వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. ఈయన
శింగనమల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరుపొందిన కపార్టు మాజీ
రీజనల్ చైర్మన్, దివంగత తరిమెల శేషానందరెడ్డి సోదరుడు. 50 ఏళ్ల రాజకీయ
నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. మహానేత వైయస్‌తో సన్నిహిత
సంబంధాలుండేవి. ఈయనతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, ఇద్దరు మాజీ
ఎంపీపీలు, 19 మంది మాజీ ఎంపీటీసీ సభ్యులు, 22 మంది మాజీ సర్పంచులు కూడా
పార్టీలో చేరనున్నారు.

Back to Top