వేరుశెనగ పొలాన్ని పరిశీలించిన షర్మిల

ధర్మవరం:

మరో ప్రజా ప్రస్థానం పదో రోజు యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. బుడంగపల్లె వద్ద ఆమె వేరుశెనగ పొలాన్ని చూశారు. వైయస్ ఉన్నప్పుడు రాయితీలు కచ్చితంగా అందేవని రైతులు ఆమెకు చెప్పారు. ఈ ప్రభుత్వం రైతును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గొల్లపల్లి క్రాస్ నుంచి యాత్ర ప్రారంభమైంది. జ్వరం కారణంగా  వైద్యుల సూచన మేరకు పాదయాత్రను ఆరు కిలోమీటర్లు కుదించారు. వసంతపురం క్రాస్ వద్ద షర్మిల రాత్ర బస చేస్తారు.షెడ్యూలు ప్రకారం అంపాపురం క్రాస్ వద్ద బసచేయాల్సి ఉంది.

Back to Top