హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మొత్తం రూ.850 కోట్లు ఖర్చు పెట్టారని .... ఆ డబ్బులను ప్రభుత్వం దేనికి ఖర్చు చేసిందో చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ప్రజలు, సభను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. అమిత్‌షా వచ్చినప్పుడు రూ. 500 కోట్ల రూపాయలను రాజధానికి కేటాయించామన్నారని, కేంద్ర ప్రభుత్వం రూ. 2200 కోట్లు ఇచ్చామని చెబుతున్నారన్నారు. తాత్కాలిక రాజధానికే రూ. 200 కోట్లు ఖర్చుపెడుతున్నారని, ఇక శాశ్వత రాజధానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఫించన్ మంజూరు చేయకపోవడం వాస్తవమా కాదా అని నిలదీశారు. సింగాపూర్ వాళ్లు ఉచితంగానే మాస్టర్‌ప్లాన్ ఇచ్చారని చెబుతున్న చంద్రబాబు... తిరిగి వారికి డబ్బులు ఎందుకు చెల్లించారని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజధాని కోసం ఎంతమేర డబ్బులు ఖర్చు పెట్టారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలన్నారు.