నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి

-బాబుకు వైయస్‌ జగన్‌ బహిరంగ లేఖ
-ఇంటికో రూ.66 వేలు బకాయిపడ్డ టీడీపీ సర్కార్‌ 
–ఎన్నికల వాగ్ధానం నెరవేర్చకపోతే ప్రత్యక్ష ఆందోళన

హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌ సీఎంకు రాసిన లేఖను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎంకు బహిరంగ లేఖ రాశాను. దీని ఉద్దేశం ఏంటంటే..చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు వాగ్ధానాలు చేశారు. నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అప్పట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్, మోడీ, ఎన్‌టీ రామారావు బొమ్మలు వేసి రాష్ట్రవ్యాప్తంగా కరపత్రాలు పంపిణీ చేశారు. బాబు అధికారంలోకి వచ్చి 33 మాసాలు అయినా కూడా ఒక్క ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగులకు అశాజ్యోతి అయినా ప్రత్యేకహోదాను నీరుగార్చారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనైనా నిరుద్యోగులకు భృతి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వైయస్‌ జగన్‌ సీఎంకు లేఖ రాశాను. ఇంటికి రూ.66 వేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలోని కోటి 75 లక్షల ఇళ్లకు ఇప్పటి వరకు రూ. 1.10 లక్షల కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటన్నింటిని బడ్జెట్లో పెట్టాలి. ఇకపై ఇంటికి రూ.2 వేలు చెల్లించాలి. చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చకపోతే నిరుద్యోగులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతాం.

ఈ వాగ్ధానం నెరవేర్చేందుకు బాబు చర్యలు తీసుకోవాలి. 
ఈ లేఖ తీసుకున్న తరువాత సీఎం ఏవిధంగా స్పందిస్తారో చూసి కార్యాచరణ వెల్లడిస్తాం. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరుతున్నాం. ప్యాకేజీయే లేదు..దానికి చట్టబద్ధత అని టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే నిరుద్యోగ సమస్య తీరి ఉండేది. ఇలాంటి గందరగోళ పరిస్థితిలో యువత నిరుత్సాహంలో ఉన్నారు. ఇందు కోసం నిరుద్యోగ భృతి చెల్లించాలని వైయస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top