భ‌విష్య‌త్తు వైయ‌స్ఆర్‌సీపీదేగుంటూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయి. భ‌విష్య‌త్తు వైయ‌స్ఆర్‌సీపీదే అని పురోహితులు జోస్యం చెప్పారు. ప్ర‌జా సంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న వైయ‌స్‌ జగన్‌ ఉగాది వేడుకలను ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో జరుపుకున్నారు.  ఆదివారం ఉదయం 9.30 గంటలకు పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. వైయ‌స్ జ‌గ‌న్‌కు రాజ‌యోగం ప‌ట్టుకుంద‌ని, 2019 ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ అత్య‌ధిక ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందుతుంద‌ని, మహానేత వైయ‌స్ఆర్‌ సువర్ణపాలనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మళ్లీ చూడబోతున్నారని పంచాంగకర్తలు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో జననేత వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు.  ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పిన వైఎస్‌ జగన్‌.. ఇంటింటా మంచి జరగాలని కోరుతున్నానన్నారు. ఈ వేడుకల్లో పలువురు పండితులు,  ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top