ఆ భయంతోనే చంద్రబాబు ఢిల్లీకి: వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈ వ్యవహారంలో ఏసీబీ తనను అరెస్ట్ చేస్తుందనే భయంతో  చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులను కలుస్తున్నారని చెప్పారు. బుధవారం ఆమె  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన సొంత వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుస్తున్నారని మండిపడ్డారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చకొడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

అవినీతిపై పదేపదే మాట్లాడే చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు. రికార్డ్ అయిన వాయిస్ చంద్రబాబుదో కాదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజించాలని ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రికి లేఖ రాసింది చంద్రబాబు కాదా? అని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు.
Back to Top