వైయస్‌ఆర్‌కు నివాళి

వైయస్‌ఆర్‌కు నివాళి
వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో పాటు ఘాట్‌కు చేరుకున్న వైయస్‌ జగన్‌ మహానేత సమాదిపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. అనంతర ం వైయస్‌ విజయమ్మ, ఆయన చెల్లెలు షర్మిలమ్మ, వైయస్‌ భారతి వైయస్‌ జగన్‌ను అభినందించారు. 

కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ
  ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ జనంతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది తరలిరావడంతో వైయస్‌ఆర్‌ ఘాట్‌ కిటకిటలాడింది. కొద్ది సేపటి క్రితమే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ ఘాట్‌కి చేరుకొని మహానేతకు నివాళులర్పించారు. ఆయన వెంట వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతి, షర్మిలమ్మ, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. 
Back to Top