పొట్టిశ్రీరాముల‌కు ఘ‌న నివాళి

హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో గురువారం అమ‌ర‌జీవి పొట్టిశ్రీ‌రాములు జ‌యంతి వేడుక‌లు ఘనంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పొట్టి శ్రీ‌రాములు చిత్ర‌ప‌టానికి పార్టీ నాయ‌కులు వాసిరెడ్డి ప‌ద్మ‌, పుత్తాప్ర‌తాప్ త‌దిత‌రులు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. వాసిరెడ్డి ప‌ద్మ మాట్లాడుతూ..తెలుగు వారి కోసం పొట్టి శ్రీ‌రాములు చేసిన పోరాటం చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌న్నారు. ఆయ‌న్ను బావిత‌రాలు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ఆమె అన్నారు.

Back to Top