గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

ఏపీ అసెంబ్లీ: గిరిజనుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని వైయస్‌ఆర్‌సీపీ గిరిజన ఎమ్మెల్యే రాజన్న దొర ఆందోళన వ్యక్తం చేశారు.శనివారం అసెంబ్లీలో గిరిజనుల సమస్యలపై రాజన్నదొర ఏకరువు పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని ధ్వజమెత్తారు. మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. సభలో ఆయన మాట్లాడుతూ..బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చులు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యహరిస్తే చట్టం ఎందుకని ప్రశ్నించారు. చట్టం లేనప్పుడే నిధులు బాగా కేటాయించేవారు. చట్టం వచ్చాక నిధులు వెన క్కి మళ్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత బడ్జెట్‌ కంటే రూ.400 కోట్లు అధికంగా ఖర్చు పెట్టామని చెబుతున్నారు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. మోడుబారిన ఇల్లు, పునాదుల వద్ద నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను మిగిలిపోయిన నిధులు కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సబ్‌ ప్లాన్‌ ద్వారా గిరిజనులకు కూడు, గూడు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు ఒక్క ఎకరా భూమి కూడా ఇవ్వలేదు. ఎస్టీఎఫ్, ఎస్‌టీపీ నిధులు ఇవ్వడం లేదు. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని నిలదీశారు. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. ఎవరికి మాఫీ చేయలేదని విమర్శించారు. హాస్టళ్లు, స్కూళ్లు మూసివేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో గిరిజనులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు.  ఆర్టికలు 341 ,342 ప్రకారం మాకు న్యాయం జరగడం లేదన్నారు. రాజ్యాంగ దిక్కరానికి పాల్పడితే గిరిజనుల పరిస్థితి ఏంటీ? అన్నారు. 

గిరిజన సలహా మండలి ఊసే లేదు
మూడేళ్లు కావస్తోన్న గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్యే రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకంటే తక్కువ గిరిజనులు ఉన్న  తెలంగాణ ప్రభుత్వం గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసిందన్నారు. 290 గిరిజన ప్రాంతాలు ఏపీలో ఎక్కువ ఉన్నా ఇక్కడ ఎందుకు సలహా మండలి ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై డిసెంబర్‌ 15న గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదఇ వాపోయారు. గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

డిమాండ్లు
గిరిజనుల సమస్యలపై పలు డిమాండ్లను ఎమ్మెల్యే రాజన్న దొర సభలో ఉంచారు. సంక్షేమ పథకానికి ఖర్చు చేసే నిధులు సబ్‌ నిధులతో చూపకూడదు. ప్రాజెక్టుల కోసం ఇతర మౌలిక సదుపాయాలకు కోసం ఖర్చు చేసే నిధులలో కోత లేకుండా చూడాలి. సబ్‌ప్లాన్‌ నిధులు కోత విధించడం, దారి మళ్లిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి. అనివార్య పరిస్థితిలో ఖర్చు కాని నిధులు వచ్చే సబ్‌ప్లాన్‌ నిధుల్లో కలపాలి. గిరిజన కమిషన్‌ ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో గిరిజనులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటున్నారు దయచేసి గిరిజనులకు కేటాయించిన నిధులు కేటాయించాలని రాజన్న దొర డిమాండ్‌ చేశారు.
Back to Top