తూర్పుగోదావరిః రపంచోడవరం ఏరియా ఆస్పత్రి వైద్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విషజ్వరాలతో అల్లాడుతున్న బాధితులను పరామర్శించేందుకు వైయస్ జగన్ వస్తున్నారని తెలిసి...25 మంది చాపరాయి విషజ్వర బాధితులను డిశ్చార్జ్ చేశారు. వైయస్ జగన్ రాకముందే వారిని డిశ్చార్జ్ చేయాలని టీడీపీ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లు మేరకు వైద్యులు వారిని ఉన్నపలంగా ఆస్పత్రినుంచి బయటకు పంపించారు. జ్వరం నయం కాకముందే డిశ్చార్జ్ చేయడం పట్ల గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. <br/>