రేపు నిరుద్యోగ వంచనపై ఆందోళన కార్యక్రమాలు



అమరావతి: నిరుద్యోగ వంచనపై ఈ నెల7వ తేదీన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికో ఉద్యోగం లేదా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఇన్నాళ్లూ నిరుద్యోగుల గురించి పట్టించుకోని ఆయన..ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి అంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తూ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 80 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించారన్నారు. ఇటు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌  ఇవ్వకుండా, మరోవైపు ఉన్న ఉద్యోగులను తొలగించి ఆయా కుటుంబాలను వీధులపాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేయడాన్ని ఖండిస్తూ..మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలు ధరించి భారీ ర్యాలీలు నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు.
 

తాజా వీడియోలు

Back to Top