- అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహణ- కొమ్మూరు వద్ద మానవహారంలో పాల్గొననున్న వైయస్ జగన్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం చర్చకు రానున్న సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా సంకల్ప మానవహారం కార్యక్రమాలను సోమవారం నిర్వహించనున్నారు.
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుదిపోరుకు సన్నద్ధమైంది. గడచిన నాలుగేళ్లలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు కలెక్టరేట్ వద్ద బైఠాయింపులు, నిరాహార దీక్షలు, యువభేరి సహా ఎన్నో నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఆది నుంచి ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు సంజీవని అంటూ ఎలుగెత్తి చాటింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ హోదాకన్నా ప్యాకేజీ మిన్న అంటూ కేంద్రం వద్ద మోకరిల్లి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టినా.. ఒక్కటే మాట, ఒక్కటే నినాదంతో ఉద్యమించిన వైయస్ఆర్సీపీ ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని తుదిపోరుకు సన్నద్ధమవుతోంది.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడా పార్టీ కూడగడుతోంది. ఈ తీర్మానంపై సోమవారం పార్లమెంట్లో చర్చకు రానున్న నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహాసంకల్ప మానవహారం చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఆయా ప్రాంతాల్లో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల భాగస్వామ్యంతో సోమవారం మానవహారాలు చేపట్టాలని నిర్ణయించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొమ్మూరు వద్ద ప్రజా సంకల్ప మానవహారంలో పాల్గొంటారు.