నేడు గవర్నర్‌ను కలవనున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు

హైదరాబాద్ః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ తీరును గవర్నర్‌కు వివరించనున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు. జగన్‌పై హత్యాయత్నం ఘటనపై థర్డ్‌ పార్టీ విచారణ జరిపించాలని గవర్నర్‌ నరసింహన్‌ను వైయస్‌ఆర్‌సీపీ బృందం కోరనుంది.

అక్టోబర్‌ 25న ఇద్దరు భద్రతా సిబ్బందితో విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన వైయ‌స్ జ‌గ‌న్‌పై శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి క‌త్తితో దాడి చేసిన విష‌యం విధిత‌మే.  విమానాశ్రయం లాంజ్‌లో కూర్చుని ఉండగా రెస్టారెంట్‌లో పనిచేసే ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ దగ్గరికి వచ్చి.. వైయ‌స్ జ‌గ‌న్‌పై దాడి చేయబోయాడు. పదునైన కత్తితో దుండగుడు ఆయ‌న‌పై దాడి చేశాడు. ఈ దాడి నుంచి జ‌న‌నేత‌ త్రుటిలో తప్పించుకున్నారు. ఆయ‌న కిందికి వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలోకి గుచ్చుకుందని, దీంతో ప్రాణాపాయం తప్పింది. హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుప‌త్రి వైద్యులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆప‌రేష‌న్ చేశారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top