అసెంబ్లీ సమావేశాలు బాయ్ కాట్

హైదరాబాద్‌: ఏపీ శీతకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్ , రోజా సస్పెన్షన్ పై ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించింది. ప్రతిపక్షంపై ఎదురుదాడే పనిగా పెట్టుకున్న పాలకపక్షం...ఎక్కడ కూడా చర్చ జరగకుండా అడ్డుపడుతూ సమావేశాలను మమ అనిపించేస్తోంది. తమ తప్పులు, అవినీతి, అక్రమాలు బయటపడతాయన్న భయంతో చంద్రబాబు కనుసన్నల్లో మంత్రులు సమావేశాలు సజావుగా సాగకుండా కుట్ర చేశారు. ఈక్రమంలోనే  ప్రతిపక్ష సభ్యులను దూషించడం,  చర్చకు అడ్డుతగలడం, మైక్ కట్ చేయడం లాంటి పనులు చేస్తూ సభా నియమాలను మంటగలిపారు.  

కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై ఇక చర్చించేంది లేదని, చర్చ ముగిసిందని ప్రభుత్వం చెప్పడంతోపాటు రోజాపై వేసిన సస్పెన్షన్ విషయంలో పునఃపరిశీలన చేసే ప్రసక్తి లేదని చెప్పడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేశారు. దీంతో,  ప్రతిపక్షం లేకుండానే అధికారపక్షం సభ్యులు ఇష్టానుసారంగా సభను నడుపుకుంటున్నారు. 

తాజా వీడియోలు

Back to Top