తిరుపతిపై ప్రభుత్వం కక్ష సాధింపు

హైదరాబాద్

28 అక్టోబర్ 2012 : తిరుపతివాసులపై కిరణ్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం విమర్శించారు. తిరుపతిలో ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆయన నిరసించారు. తిరుపతిలో 9 వేల మంది డెంగ్యూతోను, 30 వేల మంది విషజ్వరాలతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలలో వైయస్ఆర్ సీపీ గెలవగానే పట్టణానికి కేటాయించిన నిధులను పీలేరుకు తరలించారని ఆయన ఆరోపించారు. ఈ కక్ష సాధింపు ధోరణి మారకపోతే వైయస్ఆర్ సీపీ ప్రజాందోళన చేపడుతుందని భూమన హెచ్చరించారు.

Back to Top